Hyd Police Arrested Thieves Gang: యూట్యూబ్ చూసి బైకులు చోరి, ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఆబిడ్స్‌ పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్‌
Hyderabad police Arrested Interstate Gang Of Thieves (Photo-Video grab)

Hyderabad, Jan 17: యూట్యూబ్‌లో దొంగతనాల వీడియోలు చూసి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ( Interstate Gang) హైదరాబాద్ ఆబిడ్స్‌ పోలీసులు, దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ (Hyd Police Arrested Thieves Gang) చేశారు. వారివద్ద నుంచి 23 బైకులు, కిలోల వెండి, రూ.35లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. కాగా అబిడ్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని జగదీష్‌ మార్కెట్‌లో ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సంచలన విషయాలు చూశాయి. మూడు కమిషనరేట్లతో పాటు సంగారెడ్డిలో జరిగిన 25 దొంగతనాల జరిగినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు.

ఆరు నెలల కాలంలో ఈ నేరాలకు ఒడిగట్టిన అంతర్రాష్ట్ర ముఠాను అబిడ్స్, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఏసీపీ కె.వెంకట్‌రెడ్డిలతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.

బీదర్‌కు చెందిన వాజిద్‌(19) ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పాతనేరస్థుడైన అబ్దుల్‌ సమీర్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి బీదర్‌లో స్థిరపడిన కార్మికుడు షేక్‌ సోనుతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వీళ్ళంతా కలిసి నగరంతో పాటు శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తక్కువ ఖరీదు లాడ్జిల్లో బస చేస్తారు. పగలంగా నిద్రపోతూ రాత్రి వేళల్లో సంచరిస్తారు. ఎక్కడ ఏం కనపడినా వాటిని దొంగిలిస్తారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఈ అంతరాష్ట్ర ముఠా హైదరాబాద్‌లో మూడు, సైబరాబాద్‌లో 15, రాచకొండలో ఒకటి, సంగారెడ్డిలో ఆరు నేరాలు చేసింది.

పదమూడేళ్ల బాలుడిపై నలుగురు హిజ్రాలు లైంగిక దాడి, మాదకద్రవ్యాలకు బానిసను చేస్తూ..హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి అవయువ మార్పిడి, నిందితులు అరెస్ట్

ఈ నెల 3న జగదీష్‌మార్కెట్‌లోని అమ్మవారి దేవాలయంలో చోరీ చేసిన వీళ్ళు వెండి, బంగారు నగలతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌ కూడా ఎత్తకుపోయారు. అబిడ్స్‌ పోలీసులు, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వందల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ పరిశీలించారు. వజీద్‌ మూడు నెలలుగా నాంపల్లిలోని రెండు లాడ్జిల్లో ఉండి వెళ్ళినట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు.

చికెన్ కూర గొడవలో మనిషిని చంపేశాడు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని గుడివాడ గ్రామంలో దారుణ ఘటన, పరారీలో నిందితుడు, గాలిస్తున్న పోలీసులు

షహీద్, అమీర్, ఇలియాస్‌ మినహా మిగిలిన దొంగల్ని, ఇద్దరు రిసీవర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన 23 బైక్స్, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్‌ షోయబ్‌పై గతంలో పహాడీషరీఫ్‌లో హత్య, మైలార్‌దేవ్‌పల్లిలో దోపిడీ, చోరీ కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని కొత్వాల్‌ నిర్ణయించారు. తీవ్ర నేరాలకు పాల్పడ్డంతో వారిపై పీడీచట్టం ప్రయోగించనున్నట్లు సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.