Hyderabad, April 04: బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ (Banjara hills Radisson blu)పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి..పబ్ యజమానులతోపాటు సుమారు 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు (Drugs Case)కు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారిలో నాగబాబు కుమార్తె నిహారిక (Niharika)తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాడిసన్ బ్లూ హోటల్ ఘటనపై నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
Mega Brother #Nagababu Releases Statement on the happenings overnight and speculations about #Niharika pic.twitter.com/Dx3QIGW3jo
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 3, 2022
గతరాత్రి రాడిసన్ బ్లూ హోటల్ పబ్‌లో జరిగిన సంఘటనపై స్పందించడానికి కారణం…నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడుండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు ఆమె క్లియర్. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకూడదని స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయకండని విజ్ఞప్తి చేశారు నాగబాబు.
ఈ కేసులో పోలీసులు నిహారికను విచారించిన తర్వాత నోటీసులు అందజేసి.. మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అటు డ్రగ్స్ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. అరెస్టైన వారిలో పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు.
ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగరావు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు… డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు.. డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్లను రిపోర్ట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.