travel bus (Credits: X)

Hyderabad, Feb 2: యూపీ (UP) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు (Kumbh Mela 2025) వెళ్లే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా కుంభమేళాకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. అయితే, కుంభమేళా వెళ్లే భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో భక్తులను బస్సులో  ఎక్కించుకున్న డ్రైవర్.. మేడ్చల్ వరకు రాగానే.. బస్సు చెడిపోయిందని అందర్నీ దించేశాడు. ఆ తర్వాత బస్సును అక్కడే నిలిపేసి పలాయనంచిత్తగించాడు. దీంతో ఎటూ వెళ్ళలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)

Here's Video:

మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమన్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల లక్ష్మీనృసింహస్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

తప్పిపోయిన వారు దొరికారు

మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లిన నలుగురు జగిత్యాల మహిళలు బుచ్చవ్వ, సత్తవ్వ, రాజవ్వ, నరసవ్వ ఇటీవల తప్పిపోయారు. అయితే, జిల్లా ఎస్పీ ప్రయాగ్ రాజ్ పోలీసులను సంప్రదించి మహిళల ఆచూకీ ఎట్టకేలకు కనుక్కున్నారు. దీంతో కథ సుఖాంతమైంది.