Road accident (image use for representational)

Hyderabad, Feb 27: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధి హస్తినపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Hyderabad Road Accident) జరిగింది. వేగంగా దూసుకువెళ్తున్న ఓ కారు(TS05FH2356) అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్థంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైనుండి మరోపక్కకి దూసుకెళ్లింది. యువకుడు మద్యం మత్తులో (Drunk man creates ruckus at Vanasthalipuram) కారు డ్రైవ్‌ చేయడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

గౌతమ్‌ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్‌ రోడ్‌ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో వనస్థలిపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు (నెంబర్‌: TS05FH2356)) డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. గౌతమ్‌తో పాటు కారులో వెనకాల సీట్‌లో కూర్చున్న అతడి స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్‌ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం, దిశా, పలు చట్టాల కింద కేసులు నమోదు, కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ విశాల్‌ గున్ని

ఈ కేసుకు సంబంధించి ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... వనస్థలిపురం (Vanasthalipuram) బీఎన్ రెడ్డి సిగ్నల్ పోస్ట్‌లో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగిందని... వెనుక కూర్చున్న సందీప్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడని చెప్పారు. గౌతమ్ అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. గౌతమ్ ఎక్కువగా మద్యం సేవించారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సందీప్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పరారైన వ్యక్తి మల్లికార్జున్ ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా, గౌతమ్ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్‌తో నే ప్రమాదం జరిగిందని..గౌతమ్‌పై 304 ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.