Hyderabad Road Accident: మేడ్చల్‌ జిల్లాలో ఘోర విషాదం, నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి, బెంగుళూరులో రోడ్డు దాటుతుండగా బాలికపై దూసుకెళ్లిన బీబీఎంపీ చెత్త లారీ
Accident Representative image (Image: File Pic)

Hyd, Mar 22: మేడ్చల్‌ జిల్లాలోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ లారీ బీభత్సం (Hyderabad Road Accident) సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్‌ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి ( Truck runs over sleeping construction workers) దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్‌రామ్‌, చందన్‌ కుమార్‌ సహరిగా గుర్తించారు. బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక బెంగుళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న బాలికపై బీబీఎంపీ చెత్త లారీ దూసుకెళ్లడంతో మృతి చెందిన దుర్ఘటన నగరంలో హెబ్బాళ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఎయిర్‌పోర్టు రోడ్డులో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో అండర్‌పాస్‌ నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు రోడ్డు మీదనే అటుఇటు రాకపోకలు సాగించారు.

ముగ్గురు కన్నకూతుళ్లపై తండ్రి అత్యాచారయత్నం, హైదరాబాద్ లో కలకలం, భార్యను ఇంటి నుంచి తన్ని తరిమేసి, కూతుళ్లతో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నం...

అక్షయ (13) అనే 9వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసి వచ్చి రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వచ్చిన చెత్త లారీ బాలికపై దూసుకెళ్లి, బైక్‌ను కారును ఢీకొట్టింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. బైక్‌లు, కార్లు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. బీబీఎంపీ సిబ్బంది అండర్‌పాస్‌లో నీటిని తొలగించకపోవడమే ఘటనకు కారణమని విమర్శలొచ్చాయి.