Narsingi, May 19: హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపిన టిప్పర్‌ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.కారులో అక్కచెల్లెళ్లు అర్షిత, అంకితతో పాటు వారి స్నేహితులు నితిన్, అమృత్, మరికొందరు ఉన్నారు.
ఘటనాస్థలంలోనే అక్కచెల్లెళ్లు, నితిన్ మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమృత్ చనిపోయాడు. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను నిజాంపేట్ వాసులుగా గుర్తించారు.
ప్రమాద సమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు.మృతురాలు హర్షిత తన తండ్రి కారును తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెహదీపట్నం ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.