![](https://test1.latestly.com/wp-content/uploads/2022/10/rape1.jpg)
Hyd, Nov 29: హయత్‌నగర్ తట్టిఅన్నారంలో దారుణ ఘటన జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం (5 classmates gang-rape class 10 girl) చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను (record video to blackmail) తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెందిరించారు.వీడియో చూపించి పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు.
అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువకులంతా ఒకే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒకే తరగతి కావడంతో విద్యార్థిని యువకులతో సన్నిహితంగా ఉంది.
ఇదే అదునుగా భావించి నిందితులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థినిపై నాలుగు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్లలో వీడియో ఆధారంగా ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కి తరలించే అవకాశముంది.