Image used for representational purpose (Photo Credits: Pixabay)

Karimnager, OCT 09: కరీంనగర్‌ జిల్లా (Karimnagar) తిమ్మాపూర్‌ ఘటన కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ బయటపడింది. సొంత కూతురే ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దుండగులు ఇంట్లోకి రావడానికి తలుపులు తీసింది కూడా కూతురేనని విచారణలో తేలింది. తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో జరిగిన ఈ ఘటనలో సులోచన చనిపోగా, ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలు.. కూతురుని ఆదే గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి ప్రేమ వివాహం చేశారు. అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. హత్య (Murder) ఘటన శుక్రవారం జరిగింది. దీనిపై పోలీసులు ఏసీపీ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కాలనీకి చెందిన సులోచనకు భర్త చనిపోయాడు. దీంతో ఆమె తన తల్లి (Mother) దగ్గరే ఉంటోంది.

Odisha Shocker: భర్త నిద్రపోతుండగా మీద కూర్చొని అది కోసేసిన భార్య, గట్టిగా అరవకుండా గొంతు కోసేసి చంపిన మహిళ, భర్త తిట్టాడని ఘాతుకం, ఒడిశాలో భార్య కిరాతకం 

సులోచన తన కూతురికి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమ వివాహం జరిపించింది. అప్పటి నుంచి తల్లి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తల్లి సులోచన ఆస్తిపై కన్నేసిన కూతురు.. తన భర్తతో కలిసి తల్లిని హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకు కూతురు మామ కూడా సహకరించాడు. ప్రైవేట్ వ్యక్తులకు సుపారీ ఇచ్చి మర్డర్ కు ప్లాన్ చేశారు. పథకం ప్రకారమే దసరా పండుగా రోజున కూతురు తన తల్లి సులోచ ఇంటికి వెళ్లింది. తన కూతురు ఇంటికి వచ్చిందని సులోచన చాలా సంతోషపడింది. అంతలోనే ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది.

America Shooting: అమెరికాలో కోడలిని చంపిన మామ అరెస్ట్, తన కొడుకుకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఉన్నందువల్లే కాల్చివేత అని అనుమానాలు 

కూతురు, అల్లుడు వేసిన స్కెచ్ లో భాగంగా అర్థరాత్రి వేళ దుండగులు ఇంట్లోకి చొరబడి సులోచనను అతి కిరాతకంగా నరికి చంపారు. సులోచన తల్లిని దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన కూతురుని కాపాడుకోవాలని చూసింది. కానీ లాభం లేకపోయింది. దుండగులు కత్తులతో సులోచనపై దాడి చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు సులోచనను హత్య చేసి ఉంటారని భావించారు. కాగా, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆస్తి కోసం కూతురే భర్తతో కలిసి తన తల్లి సులోనను హత్య చేయించినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు.