Arrest (Credits: Twitter)

Hyd, Feb 23: విద్యార్థినులను ప్రేమ పేరుతో అధ్యాపకులు వేధించడంపై మనం ఎన్నో వార్తలు చూశాం. తాజాగా అధ్యాపకుడు ప్రేమించలేదని ఓ స్టూడంట్ అతనిపై కక్ష గట్టింది. వాళ్ల కుటుంబానికి సంబంధించిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అధ్యాపకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతోంది.

హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి (24) గ్రూప్-1 శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి ఆ విషయాన్ని అతడికి చెప్పింది.

ప్రేమించాడు, కామ వాంఛను తీర్చుకున్నాడు, పెళ్లి చేసుకోమంటే జంప్, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ఐసీయూలోనే పెళ్లి జరిపించిన పోలీసులు, కాసేపటికే మళ్లీ పరార్

ఆమె చెప్పింది విన్న ఉపాధ్యాయుడు తనకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఆమెను (rejecting love proposal) మందలించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న యువతి.. అతడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా తెరవడంతోపాటు యూట్యూబ్‌ చానెల్ ప్రారంభించింది. వాటిలో అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలను(Student Posts Porphed Pics of faculty) మార్ఫింగ్ చేసి పెట్టింది. ఫ్యాకల్టీ ప్రొఫెసర్, అతని భార్య, కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో ఆ యువతి పోస్ట్ చేసింది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది.

అక్కడితో ఆగకుండా అధ్యాపకుడు పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్‌తో పాటు హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో వాటిని షేర్ చేస్తూ వేధించడం మొదలుపెట్టింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి అనంతపురంలో ఉన్న నిందితురాలిని గురువారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు రాసిన ఆ యువతి.. ఐఏఎస్ కోసం అశోక్‌ నగర్‌లో కోచింగ్ తీసుకుంటుంది. సెకండ్ హ్యాండ్‌ ఫోన్లు కొనుగోలు చేసి యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకుందని పోలీసులు తెలిపారు.