యూనివర్సిటీ పేరిట శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ దందాకు దిగింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.. గతంలో ఆగస్టు 15లోపు బదిలీ ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తామని విద్యా సంస్థ హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్‌లో బైక్స్ స్టంట్‌లతో విధ్వంసం సృష్టించిన యువకులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
సెకండ్ ఇయర్ చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి ఫైనల్ ఇయర్ ఫీజు కూడా యాజమాన్యం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అటెండెన్స్ తక్కువ ఉందంటూ విద్యార్థులను యాజమాన్యం డీటేన్ చేసింది.
Here's Video
Sreenidhi Institute of Science & Technology - యూనివర్సిటీ పేరుతో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ దందా-TV9#medchal #SreenidhiengineeringCollege #tv9telugu pic.twitter.com/xw6jNl40Wx
— TV9 Telugu (@TV9Telugu) August 16, 2023
తమకు న్యాయం చేయాలని విద్యార్థులు క్యాంపస్ వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో విద్యార్థులకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది.