
భాగ్యనగరంలో హైటెక్ సిటీ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.