Hyd, Mar 28: ఆన్ లైన్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడేవారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గుంజుతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యక్తి నుంచి ఓ నేరగాడు రూ.55 వేలు గుంజాడు. షాకింగ్ ఘటన వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లో 30 ఏళ్ల వ్యక్తి ఓ అనామక నంబర్ (anonymous number) నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ రావడం.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.55 వేలు (Video call costs Hyderabad man Rs 55,000) ఇవ్వాలని అడగడం జరిగింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI)లో ప్రచురించిన నివేదిక ప్రకారం, అతను వాట్సాప్ (WhatsApp) కాల్ ఎత్తిన తర్వాత, అతను ఎటువంటి ఆడియో లేకుండా స్క్రీన్‌పై ఓ ఖాళీ వీడియోను చూశాడు. ఆ తర్వాత కాల్ అకస్మాత్తుగా కట్ చేయబడింది. కొన్ని నిమిషాల తర్వాత, అతనికి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియో ఉన్న సందేశం వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే మీ వీడియోను తన పరిచయస్తులతో పంచుకుంటానని నిందితుడు బెదిరించాడు.
కొద్ది రోజుల వ్యవధిలో బాధితురాలు నిందితులకు మూడు వాయిదాల్లో మొత్తం రూ.55 వేలు చెల్లించాడు. అయినా బెదిరింపులు, వసూళ్లు ఆగకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది బాధితుల సంప్రదింపు నంబర్‌లను సాధారణంగా నిందితులు వివిధ సోషల్ మీడియా ఖాతాల నుండి యాదృచ్ఛికంగా యాక్సెస్ చేస్తారు. అనంతరం ఇలా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.