GHMC Officials (Photo-Twitter)

Hyd, May 3: వాటర్‌బోర్డు కార్యాలయం మంగళవారం ఉదయం రణరంగంగా మారిన సంగతి విదితమే. సివరేజ్‌ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్‌ బోర్డు కార్యాలయంలో పారబోశారు. ఎండీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆఫీస్ ​ముందు బైఠాయించిన కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

14 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్ వాటర్‌ బోర్డు కార్యాలయంలో రణరంగం, బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, వాటర్‌ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్‌ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు.

దీంతో, వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్‌ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్‌ చేయడం ఇదే మొదటిసారి.