Hyd, Jan 24: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కని పెంచిన తల్లినే ఓ కొడుకు అత్యంత కిరాతకంగా (Hyderabad Shocker) చంపాడు. కేవలం మందలించిందన్న కోపంతో ఆ తల్లిని దారుణంగా చంపేశాడు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపమ్మ ఆమె కుటుంబంతో కలిసి నివాసముంటోంది. అయితే అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో కొడుకు సుధీర్‌ఎక్ససైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా (Youth kills his mother) కొట్టాడు. అడ్డు వచ్చిన చెల్లెల్ని కూడా రాడ్‌తో కొట్టాడు. దీంతో ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన ఇరుగురు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు (sultan bazar police station) ఘటన స్థలానికి చేరుకునేలోపే తల్లి పాపమ్మ మృతిచెందింది.
విశాఖలో దారుణం, కూతురిపై కన్న తండ్రి కొన్ని నెలలుగా అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మృతి చెందిన పాపమ్మను మార్చురీకి తరలించారు. అయితే గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.