Hyd, Oct 16: హైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కులు భయపడే స్థితికి వచ్చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది.
ప్రజలు ఇకపై మోస పోకుండా ప్లాటు లేదా ఇల్లు, బఫర్ జోన్,ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై మీరు హైదరాబాద్‌లో ఇల్లు స్థలం లేదా ఇల్లు కొనాలంటే సులువుగా ఏ అధికారి సాయం లేకుండా తెలుసుకోవచ్చు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేషన్లపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
హెచ్‌ఎండీఏ హైదరాబాదులో ఉన్న చెరువులను గుర్తించి, వాటి బఫర్ జోన్ నిర్ణయించి lakes.hmda.gov.in లో పూర్తి వివరాలు పెట్టింది.
ఈ వెబ్‌సైట్‌లో జిల్లా, మండలం, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు.అయితే బఫర్ జోన్‌లో వ్యవసాయం లేదా ఇతర వ్యవసాయ సంబంధిత పనులు చేసుకోవచ్చు. కానీ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు.