Image used for representational purpose. | File Photo

Hyderabad, AUG 13:  తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ (Rain Alert) ఇచ్చింది వాతావరణశాఖ. రానున్న రెండు రోజుల పాటూ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే గడిచిన వారంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో (Low pressure) కురిసిన వర్షాలు రెండు రోజులుగా కాస్త తగ్గాయి. అయితే తాజాగా ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్‌ (IMD Hyderabad)వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. అయితే, ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని తెలిపింది.

అయిన‌ప్ప‌టికీ శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

Cyber Blackmail: హాయ్ అంటూ వాట్సప్ మెసేజ్, రిప్లయి ఇవ్వగానే న్యూడ్ వీడియోకాల్, కాల్ ఎత్తిన తరువాత సైబర్ పోలీసుల పేరుతో బ్లాక్ మెయిల్, అదిలాబాద్‌లో ఘటన  

కాగా, రాబోయే 48 గంటల్లో అకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే గడిచిన నెలలో భారీ వర్షాల కారణంగా అన్ని జిల్లాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో భారీ వర్షాలు పడితే ప్రమాదాలు జరిగే అవకాశముందని అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉంది.