Cyber Blackmail: హాయ్ అంటూ వాట్సప్ మెసేజ్, రిప్లయి ఇవ్వగానే న్యూడ్ వీడియోకాల్, కాల్ ఎత్తిన తరువాత సైబర్ పోలీసుల పేరుతో బ్లాక్ మెయిల్, అదిలాబాద్‌లో ఘటన
Cybercrime (Photo Credits: IANS)

Adilabad, August 12: ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్ వీడయో కాల్స్ పేరుతో బ్లాక్ మెయిల్ కి (Cyber criminals blackmailed) పాల్పడుతున్నారు. తాజాగా ఓ లాయర్ ని కూడా ఇలాగే మోం చేయబోయారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మంగేష్‌కుమార్‌కు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ న్యూడ్‌ కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు.

బాధితుడి వివరాల ప్రకారం.. ఈ నెల 6న ఆయనకు పలుసార్లు వీడియోకాల్‌ వచ్చింది. మొదట వాట్సాప్‌లో హాయ్‌.. హయమ్‌ శివాని అంటూ చాటింగ్‌ చేయగా ఆ న్యాయవాది హూ ఆర్‌యూ అంటూ రిప్లే ఇచ్చాడు. ఆ తర్వాత పలుసార్లు వీడియో కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు.తర్వాత ఎవరో అని లిఫ్ట్‌ చేస్తే న్యూడ్‌కాల్‌ ( Adilabad by making nude calls)రావడంతో వెంటనే ఆయన కట్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

జంట హత్యలతో ఉలిక్కిపడిన నిజామాబాద్, తండ్రితో పాటు చిన్నాన్నను గడ్డపారతో పొడిచి చంపిన కసాయి, భూవివాదాలే కారణమంటున్న పోలీసులు

ఢిల్లీ పోలీసు పేరిట కాల్‌ చేసి వారికి డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే కేసు నమోదు అవుతుందని బెదిరించారు. తాను న్యాయవాదినని, కేసు పెడతానని మందలించడంతో మిన్నకుండిపోయారు. ఈ విషయమై సైబర్‌ క్రైంలో ఈ నె ల 7వ తేదీన ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించాడు.