Heavy Rains in Telangana: మరో రెండు రోజులు జాగ్రత్త, గోడకూలి వరంగల్‌ లో ఇద్దరు మృతి, భారీ వర్షాలకు హైదరాబాద్ సహా పలు జిల్లాలు అతలాకుతలం, మెదక్‌ లో స్కూళ్లకు సెలవులు, సూర్యాపేటలో వాగులో చిక్కుకున్న 23 మంది సేఫ్, అవసరమైతేనే బయటకు రావాలంటూ సూచన

Hyderabad, July 23: తెలంగాణపై (Telangana) వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌ (Hyderabad)సహా.. జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange alert), మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ (Yellow alert) జారీ అయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్‌ (Warangal) లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్‌లో (mandi bazar) రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20 ఏళ్ల ఫిరోజ్‌ స్పాట్‌లోనే చనిపోయారు. ఇక గాయపడ్డ మహిళ సమ్మక్క పరిస్థితి విషమంగా ఉంది. అమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అటు సూర్యాపేట (Suryapet) జిల్లాలోని పాలేరు వాగులో (Paleru vagu) చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం-జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో చికుక్కుపోయిన వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 23 మంది కూలీలు పాలేరు వాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతికి వాగు దాటడం కష్టంగా మారింది. సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది సహాయంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. వారంతా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం చౌళ్లతండాకు చెందినవారని పోలీసులు తెలిపారు.

Weather Forecast: బయటకు రాకండి, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్  

ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వార్షం ధాటికి శివ్వంపేటలో రామాలయం ప్రహరీ గోడ, పురాతన బురుజు గోడ కూలిపోయాయి. మాసాయిపేట మండలంలో హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వెల్దుర్తి చెరువు మత్తడి పారుతున్నది. వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్‌ వద్ద హల్దీవాగు బ్రిడ్జిపై నుంచి పారుతున్నది. దీంతో పోలీసులు వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. కొల్చారంలో కోతుల చెరువు అలుగు పారుతున్నది. భారీవర్షానికి వంతెన కూలిపోవడంతో హవేలి ఘనపూర్‌-గంగాపూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మోయతుమ్మెద వాగు, పోరెడ్డిపల్లి వద్ద పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది.

Job Notification in TS: తెలంగాణలో ఉద్యోగాల జాతర, మరో 2,440 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, ఏయే శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి? 

మెదక్‌ (Medak) పరిసర ప్రాంతాల్లో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలోకి వరద నీరు చేరింది. నార్సింగ్‌ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తున్నది. వరద ధాటికి ఓ బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, మెదక్‌ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రభుత్వ బడులకు సెలవు ప్రకటించారు