Hyderabad Rains (Photo-Twitter)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారింది. మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణశాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువ అవుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుపాను ఆవర్తనం కొనసాగుతున్నట్టు పేర్కొంది.

హైదరాబాద్‌లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, తీరప్రాంతంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరిక

ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

రెడ్‌ అలర్ట్‌కు కొనసాగింపుగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాసంస్థలకు బంద్‌ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే.. ఆఫీసులు, కంపెనీలు సైతం నిర్ణీత సమయాల్లో బంద్‌ కావడం మంచిదని.. రైతులూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది Hyderabad Rains వాతావరణ శాఖ. ఈ క్రమంలో జోన్ల వారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అలర్ట్‌ జారీ చేసింది జీహెచ్‌ఎంసీ.

పసిఫిక్ మహాసముద్రంలో మరో తుపాన్, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాగల కొన్ని గంటల్లో డోక్సురి టైఫూన్‌గా బలపడే అవకాశం

సోమవారంతో పోలిస్తే.. మంగళవారం వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది.

భారీ వర్షం కారణంగా చెట్లు కూలతాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రోడ్లు జలమయం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పైన పేర్కొన్న ఐదు జోన్ల పరిధిలో రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.