Independence Day 2022: గోల్కోండ కోటలో జాతీయ జెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్, బ‌లీయ‌మైన ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ ఎదిగిందని తెలిపిన ముఖ్యమంత్రి
CM-KCR (Photo-CMO Telangana)

Amatavati, August 15: స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గోల్కోండ కోటలో (Golconda Fort) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ (CM KCR Independence Day Speech) మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో ప్రతీ ఇంటా జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, తెలంగాణ త్రివర్ణ శోభితమైంది. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. తెలంగాణ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో తుర్రేబాజ్‌ఖాన్‌, రాంజీగోండు, పీవీ సహా అనేక మ​ంది పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే అన్ని రంగాల్లో ముందుంది. హైదరాబాద్‌ను గంగాజమునా తెహజిబ్‌గా మహాత్మాగాంధీ అభివర్ణించారని తెలిపారు.

త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిలో రెపరెపలాడుతోంది, ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నదని స్ప‌ష్టం చేశారు. ప్రతీ రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నదని పేర్కొన్నారు.