Hyderabad, OCT 11: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ (IND Vs BNG T-20) జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను (traffic Restrictions in Hyderabad) అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి. వరంగల్ వైపు నుంచి ఎల్‌బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి.
ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ (Uppal) వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి.