Hyderabad, May 10: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల లింక్స్ (Terror link) ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉగ్రలింక్ ఉన్న ఐదుగురిని ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ సలీం (Mohamad salim), అబ్దుర్ రెహ్మాన్, అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ లను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి భోపాల్ తీసుకెళ్లింది మధ్యప్రదేశ్ ఏటీఎస్. మరో నిందితుడు మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. నెలరోజుల క్రితం ఈ యువకులు హైదరాబాద్ రాగా.. ఇందులో మహ్మద్ హామీద్ కీలకంగా ఉన్నట్లు గుర్తించింది ఏటీఎస్. భోపాల్‌కు చెందిన యాసిర్ కీలక సూత్రధారిగా గుర్తించారు. ముగ్గురు యువకులను యాసిర్ ఇస్లాంలోకి మార్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సౌరభ్‌రాజ్‌ను మహ్మద్ సలీంగా.. దేవీప్రసాద్‌ను అబ్దుల్ రెహ్మాన్‌గా.. బస్కా వేణును ఇస్లాంలోకి మార్చాడు యాసిర్. భోపాల్, హైదరాబాద్‌లో 16 మందిని పట్టుకున్న ఏటీఎస్ పోలీసులు.
మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్న మొహమ్మద్ సలీం డెక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బయోటెక్నాలజీ విభాగం HODగా పనిచేస్తున్నాడు. ఆ కాలేజ్‌లో పనిచేస్తున్న సలీంకు టెర్రర్ లింక్‌లు ఉన్నాయన్న విషయం తెలియడంతో అతనితో సన్నిహితంగా ఉన్నవారిలో ఆందోళన మొదలైంది. సలీం ఇంట్లో రెండు ఎయిర్ గన్స్, పిల్లెట్స్, జిహాదీ సాహిత్యం లభించాయి.
భోపాల్‌కు చెందిన సలీం కొన్నేళ్లుగా గోల్కొండలో ఉంటున్నట్లు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు (Intelligence cells) గుర్తించారు. అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు ఇస్లాం మతంలోకి మారారని (religion conversion racket) ఆ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో టెర్రరిస్టు శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా రెక్కి.. తుపాకులు, కత్తులు, గొడ్డలి, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.