Jagadish Reddy vs Uttam Kumar Reddy (Photo-Twitter Video)

Hyderabad, June 1: ఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన నియంత్రిత సాగు సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Jagadish Reddy vs Uttam Kumar Reddy) మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన వానాకాలం పంటల వ్యవసాయ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి (Telangana Minister Jagadish Reddy) రుణమాఫీపై మాట్లాడినప్పుడు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడ్డుతగిలారు. రుణమాఫీ ఎక్కడిచ్చారంటూ ప్రశ్నించారు. ఇలా మధ్యలో మాట్లాడటం సభామర్యాద కాదని, గౌరవాన్ని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. అయినా ఉత్తమ్‌ తగ్గకుండా రుణమాఫీ కాలేదని మరోసారి చెప్పారు. ‘సీనియర్‌ నాయకుడివి మధ్యలో మాట్లాడడం సరికాదు. నీవు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు నువ్వుకూడా వినాలి’అని జగదీశ్‌రెడ్డి సూచించారు.

Here's War of words video

దీంతో ఉత్తమ్‌ ( Congress MP Uttam Kumar Reddy) స్పందిస్తూ.. ‘రుణమాఫీ కాలేదు, మీరు అబద్ధం చెబుతున్నారు’ అని అనడంతో మంత్రి కాస్త సీరియస్‌ అయ్యారు. ‘తెలివిలేని మాటలు మాట్లాడొద్దు. ఇది డిబేట్‌ కాదు. కూర్చోవాలి. ఇది అసెంబ్లీ, పార్లమెంట్‌ కాదు.. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి.. ఇది రైతుల కోసం పంటల సాగు విషయంలో వారిని బాగుచేసేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. ‘నువ్వు పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్‌ వేసేశారు. ‘నువ్వు మంత్రిగా ఉండడం ఈ జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ గట్టి కౌంటర్ విసిరారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరింత ఆవేశంతో మాట్లాడారు. రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని స్పష్టంచేశారు.

‘దీనిపై ఎక్కడైనా వేదిక పెట్టండి.. నేను సిద్ధం. విత్తనాలు, ఎరువులు తదితర వాటిపై కూడా చర్చకు సిద్ధం’అని సవాల్‌ చేశారు. 2014 ముందు లాఠీచార్జ్‌ లేని రోజు లేదని విమర్శించారు. ఎరువుల కోసం లైన్లు, విద్యుత్‌ కోసం ధర్నాలు నిత్యం జరిగేవని.. ఇప్పుడు కేసీఆర్‌ అడగకుండానే రైతులకు అన్నీ చేస్తున్నారనే సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.