తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్‌ని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తునట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.2025 సెప్టెంబర్‌లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు. 14 నెలల పాటు ఆయన డీజీపీగా విధులు నిర్వర్తించనున్నారు.ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. అలాగే, విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ, మహేష్ భగవత్, స్వాతి లక్రా, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు సీనియర్ల ట్రాన్స్ ఫర్
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్. తెలంగాణలో మొదట నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా జితేందర్ విధులు నిర్వహించారు.
Here's Video
Dr Jitender, 1992 batch IPS officer and currently serving as principal secretary, home department, took charge as new #DGP of #Telangana today in the place of Ravi Gupta. CM @revanth_anumula congratulates new DGP Jitender.@TelanganaCMO pic.twitter.com/eMrlesjTuq
— L Venkat Ram Reddy (@LVReddy73) July 10, 2024
I am honored to take charge as the Director General of Police (DGP) for Telangana. My commitment is to work diligently to ensure the peace, harmony, and safety of all citizens in our state.@TelanganaCMO #TelanganaPolice #DGP pic.twitter.com/hPSTRHGAJX
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 10, 2024
గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మరోవైపు.. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.