Hyd, July 27: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన అమ్నీషియా పబ్ రేప్ కేసులో (Hyderabad Gang Rape Case) ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ ాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే కొడుకుకి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్‌లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది.
సుమారు ఘటన (amnesia pub molestation case) జరిగిన 48 రోజుల తర్వాత ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టు (Remand Report)లో పేర్కొన్నారు. నిందితుల్లో చాలా మందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.