Monkey Fear (Credits: X)

Karimnagar, Jan 3: కోతులు (Monkey) బెదిరించడంతో భయపడి భవనంపై నుంచి ఓ విద్యార్థి (Student) దూకి గాయాలపాలయ్యాడు. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి క్లాస్ కు వెళ్తున్న క్రమంలో కొందరు విద్యార్థులపై కోతుల గుంపు దాడికి యత్నించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒకరినొకరు తోసుకుంటూ తరగతి గదుల్లోకి పరుగెత్తడం ప్రారంభించారు. విద్యార్థులు పరుగు తీస్తున్న క్రమంలో రఘువర్థన్ అనే విద్యార్ధి కారిడార్ వైపునకు వెళ్లాడు.

నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Here's Video:

అలా దారి వేరవ్వడంతో..

విద్యార్ధి గుంపు నుంచి వేరైన రఘువర్థన్ వెంబడి కోతులు పడ్డాయి. దీంతో భయపడిపోయిన అతను స్కూల్ భవనం పై నుంచి దూకాదు. దీంతో రఘువర్థన్ వెన్నెముకకు గాయాలయ్యాయి. రెండు కాళ్లు విరిగిపోయాయి. బాధితుడిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత