Kondagattu Anjaneya Swamy temple (Photo-Wikimedia Commons)

Hyd, Feb 24: కొండగట్టు ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంలో (Kondagattu Anjaneya Swamy temple) రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు (stole around 15 kilograms of silver objects) సమాచారం. ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. ఆలయం వెనుక గుట్ట దిగువన సీతమ్మ బావి వరకూ వెళ్లి డాగ్ స్క్వాడ్ ఆగింది.

కాగా, ఇటీవల కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్‌.. ఆలయాభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆలయం కోసం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆలయం విస్తరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తులకు వసతులపై రెండు గంటలపాటు చర్చించారు. పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు. దేశంలో ఆంజనేయుడి పుణ్యక్షేత్రం ప్రస్తావన వస్తే కొండగట్టు పేరు వినిపించాలని, హనుమాన్‌ జయంతి అనగానే దేశం మొత్తం కొండగట్టు వైపు చూడాలని సీఎం అన్నారు.