KCR National Party: మునుగోడులో జాతీయ పార్టీగానే పోటీ చేస్తాం! కేసీఆర్ జాతీయ పార్టీ పేరు, ముహుర్తం ఖరారు, దసరా రోజు టీఆర్‌ఎస్ పార్టీ పేరు మార్పుపై ప్రకటన, 300 మంది కార్యవర్గ సభ్యులతో సమావేశం, డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ
CM KCR (Photo-Video Grab)

Hyderabad, OCT 02: జాతీయ పార్టీ (National Party) ఏర్పాటుపై టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ (CM KCR) కసరత్తు తుది దశకు చేరింది. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) సమావేశమైన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ స్థాపించబోయే కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా రోజు పార్టీ నేతలతో మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈనెల 5న దసరా రోజు మధ్యాహ్నం 1.19గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. అదే రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి (TRS Meeting) సమావేశం తీర్మానం చేయనుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

ఈ సమావేశం నిర్వహించబోయే తెలంగాణ భవన్‌లో దాదాపు 300 మంది సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతమున్న టీఆర్‌ఎస్‌ ను జాతీయ పార్టీగా మార్చే ప్రక్రియపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఎన్నికల సంఘానికి దీనిపై దరఖాస్తు చేసుకోనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలో (Munugode By Election) మూడు జాతీయ పార్టీలు తలపడబోతున్నాయని, జాతీయ పార్టీగానే టీఆర్‌ఎస్ అక్కడి నుంచి పోటీ చేస్తుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లుగా వార్తలు  

ఇక డిసెంబరు 9న ఢిల్లీలో బహిరంగ సభ (TRS Rally) నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా వంటి అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

CM KCR: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన, వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై జీవో జారీ చేస్తామని హామీ..  

విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, బాణసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు.