Election Commission (photo-ANI)

5 ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదల చేయడంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది.  నువ్వు చీర‌కట్టుకుంటావా? రాహుల్ గాంధీకి చీర క‌ట్టిస్తావా? మ‌హిళ‌ల‌కు రూ. 2500 ఇస్తున్నామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్

ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

ఇదిలా ఉంటే 5 ఎకరాలు లోపు ఉన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. తాజాగా 5 ఎకరాలు పైన ఉన్నవారికి నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించారు. రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ. 2 వేల కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. తాజాగా ఈసీ బ్రేక్ వేయడంతో రైతు బంధు నిధులు విడుదల ఆగిపోనుంది.