Hyd, Nov 16: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్, క్లీనర్‌కు మధ్య జరిగిన వాగ్వాదంలో (Lorry Driver Stabs Cleaner) డ్రైవర్.. క్లీనర్‌ను హతమార్చాడు. దాదాపు 250 కిలోమీటర్లు మృతదేహంతో ప్రయాణించి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా లారీకి (Lorry) పైన టార్పాలిన్ కట్టే విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా వైరా సీఐ జెట్టి వసంతకుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన పోలోతు నైఫ్‌రాజు లారీడ్రైవర్ (Lorry Driver). అతని వద్ద తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడకు చెందిన జల్లద రాజు(45) క్లీనర్‌గా (cleaner) పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి కాకినాడ నుంచి పామాయిల్ లోడుతో మంథని వెళ్లాడు. అక్కడ సరుకు అన్‌లోడ్ అయిన తర్వాత శనివారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ వెళ్లి నూకలు లోడ్ చేసుకుని కాకినాడ బయలుదేరారు.నూకలు లోడ్ చేసే విషయంలో క్లీనర్‌కు, డ్రైవర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో కరీంనగర్‌కు చేరుకున్న సమయంలో లారీ లోడ్‌కు కట్టిన తాళ్లు వదులు కావడంతో సరిచేయాలని క్లీనర్‌కు సూచించాడు. అందుకు రాజు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
క్లీనర్ కత్తితో డ్రైవర్‌పై దాడి చేయబోయాడు. వెంటనే డ్రైవర్ నైపురాజు చాకుతో ఎదురుదాడి చేసి క్లీనర్ పొట్ట చీల్చి వేశాడు. శవాన్ని క్యాబిన్‌లోనే వేసుకుని 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్‌స్టేషన్ ఎదుట లారీ నిలిపేసి పోలీసులకు లొంగిపోయాడు. ఆత్మరక్షణ కోసం తాను తిరిగి దాడిచేయడంతో క్లీనర్ మృతి చెందాడని పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించి.. కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.