కరీంనగర్: మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో భర్త. భార్యను, ఆమె ప్రియుడిని చితకబాది బుద్ధి చెప్పాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ టౌన్‌లో వెలుగుచూసింది. అటవీ శాఖలో పనిచేస్తున్న వివాహిత తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త ఆమెపై నిఘా పెట్టాడు. భగత్ నగర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటి బయట తాళం వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
భార్యను, ఆమె ప్రియుడిని చితకబాదాడు. ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పి రాసలీలలు సాగిస్తోందంటూ ఆమె బ్యాగు, టిఫిన్ బాక్స్ చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో సహోద్యోగి వివాహేతర సంబంధం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇద్దరినీ మహిళా ఉద్యోగి భర్త పోలీసులకు అప్పగించాడు.
భర్త దాడి చేస్తుండగా వారించిన పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కి తరలించారు.అయితే అటవీ శాఖ ఉద్యోగి అదంతా అబద్ధమని చెప్పే ప్రయత్నం చేశారు. అతనే మాట్లాడాలని పిలిచి గదిలోకి వెళ్లాక బయటి నుంచి తాళం వేశాడని చెబుతున్నారు. అతని భార్యతో వివాహేతర సంబంధం అంటగడుతున్నాడంటూ ఎదురుదాడికి దిగారు. పోలీసు విచారణలో అసలు నిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.