Narayanpet, Dec 9: తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident,Narayanapeta district) చోటు చేసుకుంది. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో ఓ కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి ( Four Killed in Road Accident) చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో మరొకరు గాయపడగా... ఓ చిన్నారి సురక్షితంగా బయటపడింది. బోల్తా కొట్టిన కారు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రమాదవార్త తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మహిళలతో సహా ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లోని భీంగల్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టి హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ లారీ బైక్‌ను ఢీకొనడంతో మహిళ తీవ్రంగా గాయపడింది.