Telangana Govt Logo

Hyd, Feb 12: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఇక తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది.

అచ్చంపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌పై దాడి చేసిన వేరుశెనగ రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి.