Medak, August 1: మెదక్ జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకన్నను మహిళతో పాటు ఆమె బంధువులు చితకబాదిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్ కాలనీకి చెందిన ఓ మహిళ కొత్త ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది.
ఈ దరఖాస్తు విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తాను లోన్ ఇప్పిస్తానంటూ ఆమెతో ఫోన్‌లో అసభ్యకరంగా (committing sexual harassment) మాట్లాడటం ప్రారంభించాడు. మనం ఎవరు లేని చోట మాట్లాడుకుందామంటూ ఆమెతొ చెబుతూ వస్తున్నాడు.. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలిపింది.
గురువారం సాయంత్రం బాధిత మహిళ కుటుంబ సభ్యులు వెంకన్న ఇంటికి వెళ్లి అతడిని (woman Beaten up municipal sanitary inspector) చితకబాదారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో శనివారం పోస్టు చేయడంతో విషయం బట్టబయలైంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్, బాధిత మహిళ పరస్పరం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇరువురు పోలీస్ స్టేషన్‌లో రాజీ చేసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.