
Mulugu, Mar 1: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుపాటు జరిగిన చిన్న జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 21 రోజులపాటు మూసిఉంచాలని (Medaram Temple Closed) అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 21 వరకు ఆలయం తెరచుకోదని వెల్లడించారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర (Sammakka Saralamma temple) గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన జాతర ముగిసిన ఏడాది తర్వాత చిన్న జాతర జరపడం ఆనవాయితీగా వస్తున్నది. చివరిరోజు మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ సారి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఈవో రాజేంద్ర ప్రకటించారు. మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన పలువురికి.. కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 21 రోజులు వనదేవత గద్దెల దర్శనాలు నిలిపివేస్తూ ఈవో రాజేంద్ర తెలిపారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర అత్యంత ప్రముఖమైన జాతరగా చెప్పుకోవచ్చు. తో పూజారుల సంఘం వినతి మేరకు 21 రోజులపాటు వనదేవతల గద్దెల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి భక్తులు మేడారం రావొద్దని దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర అన్నారు.