KTR on Dubbaka Bypoll Result: ఓటమంటే భయం లేదు, ఎందుకు ఓడిపోయామో సమీక్షించుకుంటాం, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్
TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

Hyderabad, Nov 10: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ రెండవ ప్లేసుకే పరిమితమైంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత మంత్రి కేటీఆర్ (KTR on Dubbaka Bypoll Results) మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షించుకుంటామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbak by-election result) టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు, గెలుపు కోసం శ్రమించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు చెప్పారు. దుబ్బాక ఫలితం మేం ఆశించినవిధంగా రాలేదని చెప్పుకొచ్చారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు. దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.

2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించింది. దుబ్బాక ఫలితాలు తమ పార్టీ కార్యకర్తలను మరింత అప్రమత్తం అయ్యేలా చేశాయని, త్వరలోనే ఫలితాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.ఈ ఫలితాలు మా పార్టీ అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతంది.

ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకొని పార్టీ అధ్యక్షుడిని నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓడిపోవడంతో హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర భవన్ మూగబోయింది. కార్యకర్తలు రాలేదు. ఎన్నికపై ముఖ్యనేతలంతా సమీక్ష జరుపుతున్నారు.

ఉద్యమగడ్డపై బీజేపీ విజయకేతనం, కారు జోరుకు బ్రేకులు వేసిన కాషాయం పార్టీ, కనిపించని కాంగ్రెస్ ప్రభావం, 1470 ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు

దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజేపీ అభ్యర్థ రఘునందన్ రావు (BJP Win) టీఆర్ఎస్ అభ్యర్థి సోలీపేట్ సుజాతపై 1470 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.