Hyd, January 1: సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. శ్రీతేజ్ కి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పారు సీతక్క. సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడు...శ్రీతేజ్ కుటుంబానికి మా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నాం... శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నాం అన్నారు. అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే
డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకొని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించాం ...శ్రీతేజ్ సంతోషంగా బయటికి వస్తాడు అన్న నమ్మకం ఉందన్నారు. శ్రీ తేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వం.. అటు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.
శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో ఉన్నాం...నూతన సంవత్సరంలో చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యవంతుడై వస్తారన్న నమ్మకం ఉందన్నారు.