Hyd, Jan 23: కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) మాటలు నమ్మి కొందరు కులగణన సర్వేలో పాల్గొనలేదు అన్నారు మంత్రి సీతక్క(Seethakka). మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీతక్క ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉందని...ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాము అన్నారు. గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం అన్నారు.
కేవలం 4% గ్రామసభల్లోనే గొడవలు జరిగాయన్నారు మంత్రి సీతక్క. అది కూడా BRS వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు.. నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి అన్నారు. కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా BRS పత్రికలోనే చెప్పారు.. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుందన్నారు. చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు..గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నాం అన్నారు. గతంలో ఎంఎల్ఏ లు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవి... ఫామ్ హౌస్ లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారు అన్నారు. కానీ మా ప్రజా ప్రభుత్వం లో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.