Nude Video Call (Credits: X)

Mahabubnagar, Jan 5: హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ (CMR College) బాత్రూంలో (Washrooms) సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ గర్ల్స్‌ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది. అమ్మాయిల టాయిలెట్స్‌ లో శనివారం మొబైల్‌ తో వీడియోలు రికార్డు చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపల్‌ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.

అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

అదే కాలేజీ స్టూడెంట్ పనే

కాలేజీ ఎదుట విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అదే కాలేజీలోని థర్డ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ సిద్ధార్థ్‌ గా గుర్తించారు. బ్యాక్‌ లాగ్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన సమయంలో వాష్‌ రూంలో మొబైల్ కెమెరా పెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు.

సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?