PM Modi to Visit Hyderabad : జూలై 3 న హైదరాబాద్ లో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ, ప్రధాని మోదీ సహా, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం...

జూలై మూడో తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

PM Modi to Visit Hyderabad : జూలై 3 న హైదరాబాద్ లో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ, ప్రధాని మోదీ సహా, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం...
PM Narendra Modi (Photo Credits: ANI)

జూలై మూడో తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీతో పాటు జాతీయ నేతలు కూడా హాజరు కానుండటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 3వ తేదీన బహిరంగ సభను నిర్వహించడానికి జాతీయ నాయకత్వం అంగీకరించింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి

జులై 3వ తేదీన జరిగే బహిరంగ సభలో మోదీతో పాటు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొంటారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారితో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాలు కూడా ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jun 15, 2022 12:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).