ED Issues Summons To TRS MP Nama Nageswara Rao (Photo-Twitter/File Image)

Hyd, Oct 17: తెలంగాణలో రుణాల పేరిట మోసం చేసిన కేసులో (Money laundering case) అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకిచ్చింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు ( ED attaches 28 immovable properties) చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది.

నామా ఆధ్వర్యంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ రుణాల పేరిట మోసానికి పాల్పడిందంటూ ఇదివరకే ఈడీ (ED) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇదివరకే నామా కంపెనీల్లో సోదాలు చేపట్టిన ఈడీ గతంలోనే రూ.67 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసమంటూ రుణాలు తీసుకున్న మధుకాన్.. ఆ నిధుల్లో రూ.362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది.

హేయ్.. మొత్తం తీసెయ్యాలా?’.. ‘నేను విప్పేసాగా.. నువ్వు కూడా తీసేయ్’.. అమ్మాయిలను ఎర వేసి.. నగ్న వీడియోలు సేకరించి.. చర్లపల్లి జైలు ఉన్నతాధికారిని నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు.. అయోమయంలో లక్ష సమర్పించుకున్న అధికారి.. తర్వాత ఏమైంది?

అంతేకాకుండా నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao), నామా సీతయ్యలు 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. ఈ కేసులోనే తాజాగా నామాకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.

హైదరాబాద్‌, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో 28 స్థిరాస్తులను అటాచ్‌ చేయగా, గతంలోనూ రూ.73.74 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకొని మళ్లించారని ఈడీ అధికారులు తెలిపారు. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామన్నారు.షెల్‌ కంపెనీలతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడమే కాకుండా రుణంగా పొందిన కోట్ల రూపాయలను తన జేబులోకి మళ్లించుకున్న వ్యవహారంపై ఈడీ గతంలోనూ కొరడా ఝుళిపించింది.

జార్ఖండ్‌లోని రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు 2011లో నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి కాంట్రాక్టు దక్కించుకుంది. దీని నిర్మాణం కోసం కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,030 కోట్ల రుణం పొందింది. కానీ నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదు. 50.24 శాతం మాత్రమే చేసి చేతులెత్తేసింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. రోడ్డు నిర్మాణం నిమిత్తం 90 శాతం మేర రుణం పొంది నిర్మాణ పనులు ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది.