Satvik Suicide Case (Photo-ANI/File Image)

Hyd, Mar 3: నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి స్వాత్విక్ కేసులో నలుగురిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో లెక్చరర్‌ ఆచార్య, వార్డెన్‌ నరేష్‌ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని రాజేంద్రనగర్‌ మేజిస్ట్రేట్‌ ముందు నార్సింగి పోలీసులు హాజరుపరిచారు. కాగా నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌ నుంచి సాత్విక్‌ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్‌ నోట్‌ బయటపడింది.

అందులో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య, శోభన్, క్యాంపస్‌ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్‌ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని లేఖలో కోరాడు.

సాత్విక్ ఆత్మహత్య, సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి,వార్డెన్లపై కేసు నమోదు చేసిన పోలీసులు

లేఖలో..అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్‌ టార్చర్, వాళ్లు చూపించే నరకాన్ని భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా. మిస్‌ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

శ్రీ చైతన్య కాలేజీలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య, సంచలన విషయాలు వెలుగులోకి, గతంలో లెక్చరర్ కొట్టడంతో 15 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడని తల్లిదండ్రుల ఆరోపణలు

కాగా ఆ లేఖ బాగా నలిగిపోయి ఉంది. ఆ లేఖ కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్‌ స్నేహితులు చెప్తున్నారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సాత్విక్‌..గత మంగళవారం రాత్రి క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.