Hyd, Nov 23: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమరా్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఈ మెత్తం ఎక్కడిదనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలందిరినీ ఈడీ విచారిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐదుగురు.. అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ ఆలీ (Shabbir Ali), గీతారెడ్డి (Geetha Reddy), సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar)లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు నలుగురు నేతలను అధికారులు విచారించి, వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. తాజాగా బుధవారం అంజన్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విరాళాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణలో నలుగురు నేతలు విరాళాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. పార్టీ ఎవరికి ఇవ్వమని చెప్పింది? ఎందుకిచ్చారన్న కోణంలో వారిని అధికారులు విచారించారు. ఇవాళ అంజన్‌కుమార్ యాదవ్‌ను అధికారులు విచారిస్తున్నారు.