Hyderabad, Sep 29: తెలంగాణలో (Telangana) తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు (Electric Super Luxury Buses) అందుబాటులోకి వచ్చాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే అన్ని రకాల సదుపాయాలు ఈ బస్సుల్లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. తొలి దఫాలో 35 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
బస్సు ఫీచర్లు ఇవే!
- తొలి దఫాలో బస్సులు – 35
- సీటింగ్ సామర్థ్యం – 41
- ఒక్కసారి ఛార్జింగ్ కు - 325 కిలోమీటర్లు ప్రయాణం
- పూర్తి ఛార్జింగ్ కు పట్టే సమయం- 2 గంటలు
రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)