TRS Again In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...? ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ.. దీంతో తెరమరుగైన టీఆర్ఎస్ పేరు.. అయితే టీఆర్ఎస్ పేరుతో కొందరు కీలక నేతల పార్టీ పేరు రిజిస్ట్రేషన్.. వీడియోతో
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.
Hyderabad, March 5: తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ (TRS) ఇటీవల బీఆర్ఎస్ (BRS) గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లేదా తెలంగాణ రైతు సమితి/సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పలు తెలుగు మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.
ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ఆ కథనాల సారాంశం. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Mar 05, 2023 06:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

