TSPSC notifies 1,392 junior lecturer posts

Hyd, Dec 22: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ (NGT) భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్‌జీటీ ధర్మాసనం ఆదేశించింది. మొత్తం ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధించింది. జరిమానాను కేఆర్‌ఎంబీ వద్ద జమ చేయాలని ​ఎన్‌జీటీ పేర్కొంది.

ఆ యువతి కిడ్నాప్ అంతా నాటకం, పెళ్లి కోసమే ఇదంతా చేసింది, పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలు, వీడియోను విడుదల చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాపైన యువతి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం (AP Govt)  పిటిషన్ దాఖలు చేసిన తెలిసిందే.

తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు, బీఎఫ్‌-7పై ప్రభుత్వం హై అలర్ట్, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశాలు

పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి (TS Govt) జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.