Fish prasadam claims to cure breathing disorders. (Photo Credits: Ratha Radha/Twitter)

Hyderabad, May 30: కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలోఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని (No Fish 'Prasadam' Distribution) పంపిణీ చేయడం లేదని బత్తిని హరినాథ్‌గౌడ్‌ (Harinath Goud) తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని(fish 'prasadam') గతేడాది కూడా కోవిడ్ కారణంగా పంపిణీ చేయలేదన్నారు.

మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.కాగా కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారని హరినాథ్‌గౌడ్‌ వెల్లడించారు.

నేటితో ముగియ‌నున్న లాక్‌డౌన్‌, పెంచుతారా, తీసేస్తారా.., మరి కాసేపట్లో మంత్రి మండ‌లి సమావేశం, లాక్‎డౌన్ పొడిగింపు అంశంతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం

ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని సేవించేందుకు ఇక్కడికి వచ్చేవారని.. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్‌ ఉండటంతో చేప ప్రసాదం కోసం రోగులు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, ఆ మేరకు ప్రసాదాన్ని ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.