Hyderabad,December 24: కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు (Rachaconda and Cyberabad police) జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా దిశ ఘటన (Disha Murder case)తీవ్ర ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ ఘటన మద్యం మత్తులో జరగడం న్యూ ఇయర్ పార్టీలో (New Year’s Eve celebrations)మద్యం అంశం ప్రధానంగా ఉండటంతో పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా పలు నిబంధనలు, మార్గదర్శకాలను నిర్దేశించారు. వీటిని ఈవెంట్స్ నిర్వహకులు, హోటళ్లు, పబ్‌ల యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు వెళ్లాయి. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు విజన్ 2020 లక్ష్యాలను వెల్లడించారు. ఇందులో మహిళలకు పటిష్ఠ భద్రత.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
డిసెంబర్ 31 రాత్రి పాటించాల్సిన నిబంధనలు ఓ సారి తెలుసుకోండి
ఎక్కడైనా పార్టీలు జరుగుతుంటే అక్కడ జంటలకు మాత్రమే ప్రవేశం ఇవ్వాలని నిబంధనలు విధించారు. సింగిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం ఇవ్వకూడదని తెలిపారు. దీనివల్ల భద్రతకు పెద్ద పీఠ వేసేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. ఇక న్యూ ఇయర్ వేడుకల పేరుతో రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే... జైల్లో పెడతామన్నారు. ఈసారి బాణసంచా కాల్చినా, బార్లు పబ్బుల్లో అశ్లీల వేషాలు వేసినా చర్యలు తప్పవు.
ఇక మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనాలు నడుపుతూ దొరికితే (Drunk and Drive) రూ.10వేలు ఫైన్ వేస్తామన్నారు. అంతేకాదు వాహనాన్ని సీజ్ చేస్తారు. డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే రూ.10 వేల భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయనున్నారు.