దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఉమామహేశ్వరి మరణవార్తను విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కాగా ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. చంద్రబాబు కుటుంబసభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు.
ఉమామహేశ్వరి ఆత్మహత్య విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి.