Representational Image (Photo Credits: Pixabay)

Siddipet, March 29: మూగజీవాల పట్ల ఒక సర్పంచ్ చేసిన పని మానవత్వానికే మచ్చ తెచ్చింది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతోనే మూగజీవాల అయినా కుక్కలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో వెలుగులోకి వస్తుంది ఈ ఘటన..జాతీయ స్థాయిలో చర్చగా మిగిలింది.  విషం ఇవ్వడంతో వందకు పైగా కుక్కలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది.

గ్రామస్తుడొకరు తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాదులోని స్ట్రే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది. సంస్థ ప్రతినిధులు శశికళ, గౌతమ్ పలు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కుక్కల బెడదపై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో…  సర్పంచ్  కప్పర భాను ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్ ఇద్దరూ కలిసి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇప్పించారు.

బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

విషం వల్ల వందకుపైగా లక్షణాలు చనిపోయాయని, వాటి కళేబరాలను గ్రామ పరిసరాల్లోని పాత బావుల్లో వేసి పూడ్చివేశారని తెలిపారు. ఈ విషయం మీద జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదు అన్నారు. దీన్ని వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. తీగుల్ లో కుక్కలకు విషం ఇంజక్షన్లు ఇది చంపినట్లు ఫిర్యాదు రాగా సర్పంచి, కార్యదర్శిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.